Chandrababu: నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశాన్ని ఈసీ కేస్ స్టడీగా తీసుకోవాలని ఆయన కోరారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. చంద్రగిరిలో 28 వేల ఓట్లను కొత్తగా చేర్చారని.. 13 వేలకు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయన్నారు. తిరుపతికి చెందిన వ్యక్తిని చంద్రగిరిలో రెండు ఓట్లుగా చేర్చారని ఆయన ఆరోపించారు.
Read Also: CM YS Jagan: రేపు సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటన
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈసీ కూడా గత తిరుపతి ఉపఎన్నికల విషయంలో సీరియస్‌గా రియాక్టు అయ్యిందని గుర్తు చేశారు. పులివర్తి నాని ఆరునెలలుగా పోరాటం చేశారని.. అలా పోరాటం చేస్తూ నాని ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. అ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో తప్పులు చేయలేదు .. కానీ వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా దొంగ ఓట్లపై దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థ భృష్టు పట్టిందని, ఈసీ సీరియస్‌గా ఉండటంతో ఇప్పుడు పోలీసుల్లో భయం వచ్చిందన్నారు. తప్పుచేసిన ఆర్వోను అరెస్టు చేయాలన్నారు. అరెస్టు చేస్తే విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!