Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయినా.. ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. రేపు సుప్రీంకోర్టు తీర్పులు వెల్లడించనుంది.
Read Also: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. దీంతో ఎన్నికల ముంగిట ఎటువంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్టు చేశారని.. రాజకీయ కక్షతోనే ఈ విధంగా వ్యవహరించారని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో జాతీయస్థాయిలో రాజకీయ కక్ష బాధితులు, అటు ప్రభుత్వాధినేతలు ఈ కేసు తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.