ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.
ల్లుండి విజయవాడలో అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్ అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్ట్‌పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్‌ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
శంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు తన నాల్గవ ఎలక్ట్రిక్ కారు 'టాటా పంచ్ ఈవీ'ని విడుదల చేసింది. రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు, రెండు విభిన్న డ్రైవింగ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ దేశంలోనే అత్యంత సురక్షితమైన ఈవీ కారు అని కంపెనీ పేర్కొంది.