శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది.
అనకాపల్లి జిల్లాలో కోడికత్తి దాడి కేసు కులం రంగు పులుముకుంది. నిందితులపై చర్యలు చేపట్టాలని ప్రత్యర్థి వర్గం రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన యువకులు మధ్య కనుమపండుగ రోజు కోడి పందాల విషయంలో వాగ్వివాదం జరిగింది.
దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం శుభపరిణామమని అని బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ అన్నారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు.
చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు.
గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని పెద్దలు సామెత చెబుతారు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ. కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.
మకర సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.