డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సింహాసనం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లోని క్రిస్టియన్ బోర్గ్ ప్యాలెస్‌లో సంబంధిత దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. అనంతరం ఆమె పెద్దకుమారుడు ఫ్రెడెరిక్-10ను రాజుగా ప్రకటించారు
ఉదయాన్నే నిద్రలేవడం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల రోజంతా శరీరం చురుగ్గా ఉంటుందని, మన రోజువారీ పనులు సమయానికి పూర్తవుతాయని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు.
విశాఖ విమానాశ్రయంలో పండుగ రద్దీ వేళ పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసులు రద్దు కావడంతో పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావలసిన సర్వీసులు రద్దయ్యాయి.
ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.
విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్యర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభమైంది.మణిపూర్‌లోని తౌబాల్ నుంచి 'భారత్ జోడో న్యాయ యాత్ర'ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ జెండా ఊపి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
వైసీపీ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై వైసీపీ అధిష్ఠానం పూర్తిగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై సీఎం జగన్ చాలా రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.