జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు.
బుధవారం పాట్నా నుంచి పుణె వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో తన అమ్మమ్మ చనిపోయిందని పైలట్‌కు సమాచారం అందింది. అమ్మమ్మ మృతితో మనస్తాపానికి గురైన పైలట్ విమానాన్ని నడపలేదు. దీని తర్వాత విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ సిబ్బందిని పిలిచింది. ఈ క్రమంలో విమానం దాదాపు మూడు గంటల తర్వాత ఆలస్యంగా బయలు దేరింది.
చలికాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల మన శరీరంలో జరిగే మార్పుల వల్ల ఇది సాధారణంగా జరుగుతుంది. చలి కారణంగా, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మన ధమనులు సంకోచించబడతాయి, దీనిని వాసోకాన్స్ట్రిక్షన్ అంటారు. దీని కారణంగా రక్త ప్రసరణలో సమస్యలు ఉండవచ్చు
ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.
రాష్ట్రంలో తాను చెప్పిన జోస్యం ప్రకారం అప్పటి మంత్రి అజయ్ తూడుచుకుపోతాడు అన్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి వెల్లడించారు. అదే జరిగిందని ఆమె తెలిపారు. ఈ జిల్లాకు స్వేచ్ఛ వచ్చిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం టెహ్రాన్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ గురువారం ఇరాన్‌లోని సిస్తాన్-ఓ-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్లామాబాద్‌లోని ఒక ప్రకటనలో, పాకిస్తాన్ భద్రతా దళాలు సమన్వయంతో , నిర్దిష్ట లక్ష్యంగా ఖచ్చితమైన సైనిక దాడులను నిర్వహించాయని పేర్కొంది.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే.