Minister Kakani Govardhan Reddy: చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు. కేసును క్వాష్ చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమికంగా చంద్రబాబు దోషి అని తేల్చిందని మంత్రి వెల్లడించారు. 17ఏ కింద అనుమతి తీసుకొని ఉంటే బాగుండేదని మాత్రమే ఒక జడ్జి అభిప్రాయపడ్డారని.. ఇప్పుడైనా తీసుకోమని చెప్పారన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని మంత్రి కాకాని పేర్కొన్నారు. చంద్రబాబు జీవిత చరమాంకంలో జైలు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. మరోసారి చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.
Read Also: MLA Rakshana Nidhi: టీడీపీతో టచ్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రాజీనామాకు రెడీ..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరారు.. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. దీంతో, చంద్రబాబు పిటిషన్‌పై సీజేఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.