ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ-20 ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం తెలిపారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెడ్ల సత్రం వద్ద స్థానికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన భక్తులు, స్థానికులు చిరుతపులి వీడియోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.
తన రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష అని నరసరావు పేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాను రాజకీయాలకు వచ్చేటప్పటికి ఒంటరినని తెలిపారు. కోటప్పకొండ శివుడు సాక్షిగా చెబుతున్నా.. నాకు ఎవరూ లేకపోయినా తండ్రి లాగా, సాక్షాత్తు దైవంలాగా సీఎం జగన్ నన్ను ఆదరించారని ఆయన వెల్లడించారు.
గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది నియామకానికి సీఈసీ నో అబ్జెక్షన్ తెలిపింది.
వాలంటైన్స్ డే రోజున సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేమ పక్షులు ఎన్నో వీడియోలు షేర్ చేసుకున్నారు. వాలంటైన్స్ వీక్‌ను ప్రేమికులంతా తమ ప్రేమను భాగస్వామికి తెలిసేలా రోజుకో రీతిలో వ్యక్తపరిచారు. అంతకు మించి అన్నట్లు వాలంటైన్స్ డే అన్నట్లు జరుపుకున్నారు.
ఈ ఏడాది స్మార్ట్ సిటీ మిషన్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. పథకంలో పొందుపరిచిన నగరాల్లోని సీఈవోలను పదే పదే బదిలీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. వారికి నిర్ణీత పదవీకాలాన్ని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం మళ్లీ రాష్ట్రాలను కోరింది.
పశ్చిమ కనుమల్లో కప్ప శరీరంపై పుట్టగొడుగులు పెరిగిన ఘటనతో శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు. ఒక జీవి శరీరంపై ఇలా కనిపించడం ఇదే తొలిసారి. ఈ జీవిని జూన్ 19న కర్ణాటకలోని కర్కాలలో గుర్తించారు.
2024లో అనేక గ్రహణాలు కనిపించనున్నాయి. ఈ సంవత్సరం చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం వంటి ఖగోళ సంఘటనలకు సాక్షిగా ఉంటుంది. చంద్రుడు భూమికి మధ్య వచ్చి సూర్యుని కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్‌లో అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. కానీ సూర్యగ్రహణం సంభవించే ప్రదేశం భూమి మాత్రమే కాదు. ఈ రకమైన గ్రహణం సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలపై కూడా సంభవిస్తుంది.