Minister Gudivada Amarnath: ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. నేను చంద్రబాబు లాగా కుర్చీ లాక్కున్న లక్షణం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ లాక్కున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్‌లో కూర్చున్నానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదన్నారు. టీడీపీ నేతలు తెలివితక్కువ దద్దమ్మలు అని మండిపడ్డారు. అసెంబ్లీలో బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కుర్చున్నారని.. బాలకృష్ణను ధూళిపాలి నరేంద్ర ప్రశ్నించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద మేము సైనికులమని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.
Read Also: Mekathoti Sucharita: దండాలయ్యా.. మహారాజై నువ్వు ఉండాలయ్యా.. జగన్‌పై పాటపాడిన సుచరిత
జగన్ అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రభుత్వంలో ఒక భాగమని.. వాలంటీర్లకు-వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అందరి తలరాతలు భగవంతుడు రాస్తే-నా తల రాత జగన్మోహన్ రెడ్డి రాస్తారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ గెలుపే నా లక్ష్యమన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తేనే గుర్తింపు వచ్చింది అనేది అమాయకత్వమన్నారు. అమర్‌నాథ్ పోటీ చేసినా, చేయకపోయనా వైసీపీ జెండా పట్టుకొని పని చేస్తామన్నారు.