Bandi Sanjay: ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్‌ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో మేము 17కి 17సీట్లు గెలుస్తామని.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారన్నారు.
Read Also: PM Modi: రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తోంది..ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు..
Also Read
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి ఎవరు హరీష్ రావుతో సహా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు అవగాహన ఒప్పందం ఉందన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఇన్ని స్కాంలు బయటపడుతున్న చర్యలు కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లన్నారు. గ్రౌండ్ లెవెల్‌లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. కేఏ పాల్ కూడా 17సీట్లు గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒక్కవైఫు , రజాకార్లు, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీని ప్రజలే బహిష్కరిస్తారన్నారు. ఏ ప్రభుత్వం అయిన ఐదు ఏళ్లు ఉండాలని కోరుకుంటామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కి బుద్ది చెప్తారని బండి సంజయ్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని ఆరోపించారు… అప్పుడు కూడా కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు… అప్పుడెందుకు సీబీఐ ఎంక్వైరీ అడిగారు … ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?