కారు ప్రమాదంలో మరణించిన బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. లాస్యనందిత కుటుంబసభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు.
బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఓటమి భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. పాపపు సొమ్ముతో చండి యాగాలు, పూజలు చేయడం కాదని.. 3 స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్లో పేదలకు స్థలాలు ఇచ్చింది నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి అని ఆయన పేర్కొన్నారు.
బీసీలు అధికంగా ఉండే ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను తెలుగుదేశం పార్టీ బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ ఐక్యవేదిక నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించారు. మాచాని సోమప్ప మెమోరియల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 30 కులాల బీసీ నాయకులు భారీ ఎత్తులో పాల్గొన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
మేడారంలో సమ్మక్క సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ 75 రోజుల పాలన గురించి వివరించారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమై.. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చించింది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పెన్షన్ బకాయిలు, ఇతర డిమాండ్లపై చర్చించింది. నాలుగు అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
వారి ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సు అర్హత కాదని నిరూపించింది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన 3 నెలల 24 రోజులున్న దెందె రేయాన్షి. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన దెందె సుస్మిత, ప్రవీణ్ దంపతుల మూడు నెలల చిన్నారి రేయాన్షి అద్భుతం సృష్టించింది.
హైదరాబాద్ కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్‌లో మెగాడ్రోన్ షో ఆదివారం జరిగింది. సీఎంఆర్ ఫ్యామిలీ, సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూయలెరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షో, మెగా డ్రోన్ షో జరిగాయి.