Undavalli Arun Kumar: ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంట్లో అప్రజాస్వామ్యక పద్ధతిలో ఆమోదం జరిగి ఇవాల్టితో 10 ఏళ్లు పూర్తయ్యాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ అవలేదు అన్న విషయం లోక్‌సభ ప్రచురించిన డాక్యుమెంటులోని ఉంది దాని ఆధారంగానే కోర్టుకు వెళ్లానన్నారు. లోక్‌సభలో ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు పాస్ చేసిన వ్యవహారం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. బిల్లు పాసవ్వడానికి కావలసిన మెజార్టీ రాదన్న విషయం కాంగ్రెస్‌కి కూడా తెలుసని ఆయన వెల్లడించారు. తనను సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ స్టేట్ గవర్నమెంట్ గతంలో అఫిడవిట్ కూడా ఫైల్ చేసిందన్నారు. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014 మార్చి ఒకటినే ప్రకటించిందన్నారు.
Read Also: Ayodhya: టీటీడీ సహాయం కోరిన అయోధ్య రామమందిరం ట్రస్ట్.. సౌకర్యాల కల్పనకు సహకారం
2015 డిసెంబర్ నాటికి నీతి అయోగ్ తయారుచేసిన రిపోర్ట్ తమకు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు రామచంద్ర రావు కోరినా ఇవ్వమని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 వేల కోట్లు అడిగితే నాలుగు వేల కోట్లు తగ్గించి ఇచ్చారన్నారు. ట్యాక్స్ ఇన్‌సెంటివ్స్ కూడా ఇవ్వలేమని చెప్పారని ఆయన వెల్లడించారు. పోలవరం 70:30 నిష్పత్తిలో కట్టాలని ఆయన చెప్పారు. 58: 42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 89 ఆస్తులను పంచుకోవాలని 9వ షెడ్యూల్లో పెట్టారని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. దీనిపై ఇంతవరకు ఏ రకమైన సమాధానం కేంద్రం ఇవ్వటం లేదన్నారు. కొట్టుకుచావండని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసిందన్నారు. ఏ ఇన్స్టిట్యూట్ కట్టాలన్నా కేంద్రం విధులు మంజూరు చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పోలవరానికి జనాన్ని బస్సుల్లో తీసుకెళ్ళి భజనలు పెట్టి చూపించేవారన్నారు.