Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ విశాఖకు రానున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరుగా మాట్లాడనున్నారు. పొత్తులో జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గం నేతలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు