Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. పొన్నం.. మీ పార్టీ మాట తప్పినందుకు గాంధీభవన్ వద్ద దీక్ష చెయ్యి.. కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చెయ్యి.. 80 కోట్ల మంది పేదలకు మోడీ అన్నం పెడుతున్నందుకు.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అన్న వర్గాలను దగా చేసినప్పుడు ఒక్కనాడు కూడా దీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నలు గుప్పించారు. వడ్ల కుప్పలపై రైతులు గుండెపగలి చస్తుంటే.. ఎందుకు దీక్ష చేయలేదని అడిగారు.
Read Also: Ponnam Prabhakar: ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి.. ఎందుకంటే?
Also Read
వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చిన తర్వాతే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొంటారా? లేదా? అంటూ ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని.. వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష జరపడం లేదని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలుపై అరిగోస పడ్డ రైతులకు అండగా నిలిచింది తామేనని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి తెలియని కూటమికి ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. నిధులు తెచ్చి అభివృద్ధి నేను చేస్తుంటే… మీరు ప్రచారం చేసుకుంటారా అని బండి సంజయ్ అన్నారు. అభ్యర్థే దొరకని కాంగ్రెస్, అపర మేధావి కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!