Election Commission: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఏకంగా సీఎంపై దాడి జరగడమేంటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై సీఈసీ ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెందిన కొందరు పోలీస్ అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Sajjala Ramakrishna Reddy: జగన్‌పై దాడి.. పిరికిపందల చర్య
చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలు సంధించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశముంది.