నూటికి నూరు శాతం ఓట్లేసి రాష్ట్రానికి దారి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటింగ్‌లో ఉద్యోగులు నిబద్ధతతో ఓట్లు వేశారన్నారు. 80శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
గుజరాత్‌లోని దాహోద్ లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్ స్టేషన్‌లో మే 11న తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. దానికి కారణం ఏంటంటే.. ఓ వ్యక్తి ఓటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షప్రసారం చేయడమే.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అత్యధిక మెజార్టీ లక్ష్యంగా దాడిశెట్టి కుటుంబ సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు ఎండలతో జనాలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు వానలు కాస్తా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం లభించింది. ప్రధానంగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.