Chandrababu: ఏపీలో మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైసీపీ వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. పోలింగ్ అనంతరం ప్రణాళికాబద్ధంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు పాల్పడుతున్నాడని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని చంద్రబాబు కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని చంద్రబాబు కోరారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి.. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు కోరారు.
Read Also: Botsa Satyanarayana: జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు..