ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది.
సీఎం పేషీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాల రాజు, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం బదిలీ చేసింది.
వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణమవుతున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ పేరుతో పాటు బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ఉన్నా పట్టించుకోకండా టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్ క్యాంపు కార్యాలయమును వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.