రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గ్రూప్ - I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మలన్న విజయం దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) ఆధిక్యంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలను కూడా చూస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.
విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు.. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు.
ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్ అందించారని.. ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.