Rajahmundry: వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణమవుతున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ పేరుతో పాటు బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ఉన్నా పట్టించుకోకండా టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మోరంపూడి ఫ్లై ఓవర్‌ను అధికారులతో కలిసి పరిశీలిస్తుండగా టీడీపీ అల్లరిమూకలు దారుణమైన చర్యలకు పాల్పడ్డారు.
Read Also: PM Modi: పవన్ అంటే పవనం కాదు, ఒక సునామీ.. పార్లమెంట్‌లో మోడీ ప్రశంసలు
విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ భరత్ రామ్ ఘటన స్థలానికి చేరుకుని రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి ప్రశాంతమైన నగరం ఎంతో మందితో పోరాడి గత ప్రభుత్వాలు చేయలేని విధంగా మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు ప్లైఓవర్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారని వివరించారు. శిలాఫలకంపై తన పేరు మాత్రమే కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్లు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. శిలాఫలకం ధ్వంసం చేసినా ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరని అన్నారు. అలజడి సృష్టించటం వల్ల ఉపయోగం లేదని, అభివృద్ధి కోసం పాటుపడండి… అంటూ విజ్ఞప్తి చేశారు.