ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు.
ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని.. తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఓ చిన్నారి పై కొందరు యవకులు జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లంచానికి థ్యాంక్స్ చెప్పారు. అది అందరికీ ఈజీగా అర్థం అయ్యే భాష అని.. అది ఉంది కాబట్టే 28 సంవత్సరాల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్‌హాసన్ ఎంతో అద్భుతంగా నటించారని, అలాంటి నటుడు ఈ దేశంలో కాదు.. ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని దర్శకుడు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.