Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకారం.. యుద్ధం ముగియనుందా?
- యూఎస్ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగియనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas Conflict: హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలు ప్రారంభించాలనే యూఎస్ ప్రతిపాదనకు హమాస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయాలంటే ముందుగా ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పాలస్తీనా సంస్థ(హమాస్) డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అంగీకరిస్తే ఈ ప్రతిపాదన ఓ ఒప్పందానికి దారి తీస్తుందని కాల్పుల విరమణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న పాలస్తీనా అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఒప్పందంలో మొదటి దశ అని తెలిసింది. ఒప్పందంలోని రెండో దశను అమలు చేసేందుకు పరోక్ష చర్చలు కొనసాగుతాయి దీంతో గతేడాది అక్టోబర్ 7న మొదలైన గాజా యుద్ధం ముగియనుంది.
Read Also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఈ యుద్ధం వల్ల గాజాలో 38 వేలకు పైగా మరణించారు. హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ నగరాలపై దాడి చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. వారు దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకోగా, దాదాపు 1,200 మంది ఈ దాడిలో మరణించారు. అనంతరం గాజాపై మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. గాజాపై బాంబుల వర్షం కురిపించడంతో అమాయక ప్రజలు కూడా మృతి చెందారు.
ఇజ్రాయెల్ దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనా ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జెనిన్ క్యాంప్‌లోని యువకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసిందని, పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పులకు ప్రతీకారంగా జెనిన్‌కు పశ్చిమాన ఉన్న ఇంటిని ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయని పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరించింది.
తాజావార్తలు
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!