Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి దర్శించుకోవాలనే భక్తుల కోసం టీటీడీ నేడు టికెట్లను విడుదల చేయనుంది. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, దర్శన స్లాట్‌లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలలో శ్రీవారి […]
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ వివరించనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్‌ను బైడెన్ ప్రతిపాదించారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది.