AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ వివరించనున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు.. గత ఐదేళ్ల పాలనను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతే ఏపీ రాజధాని అనే విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు హై ప్రయార్టీ, గంజాయి నివారణ వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు రానున్నారు. వైసీపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారంటూ సభ బయట, లోపల నిరసనలు తెలిపేందుకు వైసీపీ ప్రణాళికలు చేసినట్లు సమాచారం.
Read Also: Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్