పెద్దలకు టీబీ బీసీజి టీకాలు వేయడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ టీకాలు వేసినప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్యను కూడా ఏఎన్ఎంలు క్రియేట్ చేయాలన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జాతీయ టీబీ నిర్మూలనా కార్యక్రమంపై సమీక్షించారు.
ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు.
పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్‌లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది.
వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాల కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు.
ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తోంది. కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందించనున్నట్లు ప్రకటించింది.
అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఆగస్టు 1నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీపై తప్పుడు కూతలు మానుకోవాలన్నారు.