యూపీలోని సోన్‌భద్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని తన ఇంటి నుంచి 3 నెలలుగా కనిపించకుండా పోయిన ఒక మహిళ.. యూపీలోని సోన్‌భద్రలోని గుహ లోపల నాగినిలా ప్రత్యక్షమైంది. ఆ మహిళ అచ్చం పాములాగే బుసలు కొడుతూ అసాధారణ స్థితిలో కనిపించింది. ఆ మహిళ నాగిని లాగే భూమిపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు మహి, తల అని పిలుచుకుంటారు. ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో 'తల ఫర్ ఎ రీజన్'తో ట్రెండ్ అయ్యాడు. ఇందులో మహి అభిమానులది పెద్ద పాత్ర. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ఏదైనా జరిగినప్పుడు సోషల్ మీడియాలో డిఫెన్స్ చేయడం అభిమానుల ప్రేమ అని చెప్పుకొచ్చారు.
ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్ తొలి వన్డే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడినట్లు తెలిసింది.
భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 22 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మ్యాచ్‌లో 32 ఏళ్ల స్వదేశీయుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఎన్నో పతకాశలతో వెళ్లిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూసింది.
నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు.
చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు