శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,91,003 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది.
పిఠాపురం మహారాజా వారసులకు చెందిన ఆస్తుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే విచారణ చేయాలని కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆర్డీవో కిషోర్ విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని.. ఈ ఆస్తికి సంబంధించి వివాదం కోర్టు పరిధిలో ఉందని.. ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ చంద్రలేఖ కుటుంబానికి చెందినదని.. శాఖా పరంగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్(ఆదాయపు పన్ను రిటర్న్‌లు) దాఖలు చేయడానికి జులై 31తో చివరి తేదీ గడువు ముగియనుంది. రిటర్న్‌ల ఫైలింగ్‌కు కొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించింది.
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. జులై 3న రీఛార్జ్ ఛార్జీలను పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కొత్త ప్లాన్‌లు చేర్చబడ్డాయి. వీటిలో ఓటీటీ ప్రయోజనాలు కూడా ఇవ్వబడుతున్నాయి.
ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసిన క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కి కూడా మీ చర్మం మీకు కావలసినంత మెరుస్తూ ఉండదు. కానీ అదే మార్కెట్ నుంచి కేవరం రూ.20 నుంచి 25 రూపాయలకు మంచి బ్యూటీ ప్రొడక్ట్ కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా.
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సారి గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా మొత్తం నాలుగు పిక్సెల్ ఫోన్‌లు లాంచ్ కానున్నట్లు తెలిసింది. సమాచారం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు 14న భారత్‌లో ప్రారంభించబడతాయి.
మహిళలు మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ వారి ఆరోగ్యం పట్ల చాలా అజాగ్రత్తగా ఉంటారు. ఈ అజాగ్రత్త వల్ల చాలా మంది మహిళలు చిన్నవయసులోనే ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మోనోపాజ్ తర్వాత, స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు తగ్గడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి.