ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు వివిధ దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని తన మిలియన్ల మంది సబ్‌స్కైబర్లకు చెప్పారు. తన బయోలాజికల్ పిల్లల గురించి పలు వివరాలను తన సుదీర్ఘ పోస్ట్‌లో వారితో పంచుకున్నారు.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా చరిత్ర సృష్టించి దేశం గర్వించేలా చేసింది. 16వ రౌండ్‌కు అంటే ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా మంత్రి […]
గాయని చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్ చిన్మయి తన పాటలతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సహా నటీమణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలానే పిల్లలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లు తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది.