ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్‌కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడింది..
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి.
ప్రస్తుత సమాజంలో గర్ల్‌ఫ్రెండ్ అనగానే ప్రేయసి అని.. బాయ్‌ఫ్రెండ్ అనగానే ప్రియుడు అనే అర్థం వచ్చేయడం బాధ పరిచే అంశం. ఈ క్రమంలోనే ఈ రోజుల్లో స్నేహితుల్ని ఇతరులకు పరిచయం చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. కానీ జాతీయ గర్లఫ్రెండ్స్ దినోత్సవం ఉద్దేశం పూర్తిగా వేరు. ఇందులో ప్రేమకు చోటు లేదు.. కేవలం స్నేహానికి మాత్రం చోటు ఉంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.
“తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా "అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.