ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిషన్ -2029కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది టీడీపీ. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు.
ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు.
కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామ సభలు నిర్వహించాలని పవన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలన్నారు.
చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అనంతరం ఉండవల్లి వెళ్తూ మధ్యలో ఆగారు. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి.. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.