కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం తగ్గిపోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది.
వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడిందన్నారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక మంత్రి ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 53రోజులు ఇదే రాజమండ్రి జైలులో ఉంచారు. ఎలాంటి తప్పు చేయకుండా చంద్రబాబును జైలులో పెట్టారని నాటి పరిస్థితి గుర్తు చేసుకొని ఆవేదన చెందారు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ ఫైల్ చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడారు.
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష చేపట్టారు.
ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. తణుకులో టీడీఆర్ స్కాంపై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. తణుకు టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. టీడీఆర్ స్కాంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.