Deputy CM Pawan Kalyan: కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామ సభలు నిర్వహించాలని పవన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. దేశంలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పనులపై నిర్ణయం తీసుకోవడం తొలిసారి అవుతుందన్నారు. అటవీ సంపద, వాటర్ బాడీస్ పరిరక్షించుకునే అంశంపై చంద్రబాబు పవన్ సూచనలు చేశారు. వనభోజనాలు, భారీ ఎత్తున మొక్కల పెంపకం వంటివి చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు
వాటర్ బాడీస్ అన్యాక్రాంతం కాకుండా చూడాలని పవన్ సూచించారు. ప్రకృతితో మమేకం అయ్యే కార్యక్రమాలు చేపడితే భూములు.. వాటర్ బాడీస్ సురక్షితంగా ఉంటాయన్నారు. జల హారతుల కార్యక్రమం గతంలో చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు. అనంతరం తాము కూడా జనసేన పార్టీలో మన ఊరు-మన నది కార్యక్రమం చేపట్టామన్న పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ కార్యక్రమం వివరాలు తీసుకుని ప్రకృతితో ప్రజలు కనెక్ట్ అయ్యే ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.