జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు.
విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది.
చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేతన్నలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేయగా.. స్టాళ్లల్లో ఉత్పత్తులను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ స్టాళ్లలో సతీమణి భువనేశ్వరి కోసం చీరలను కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలను కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొనుగోలు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు.
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త.
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది.