రియల్‌మీ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. రియల్‌మీ సీ30 పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటు చేసింది. UniSoc T612 ప్రాసెసర్‌తో ఈ బడ్జెట్ ఫోన్ రానుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10వాట్ల సాండర్డ్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు రియల్‌మీ సీ30కి కొన్ని కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.
అటు బెంచ్ మార్క్ టెస్ట్‌లో ఈ ప్రాసెసర్ 1,76,932 పాయింట్లు స్కోర్ చేసిందని రియల్‌మీ పేర్కొంది. 5,000mAh బ్యాటరీ ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. రియల్‌మీ సీ30 మొబైల్ 182 గ్రాముల బరువు, 8.5 మిల్లీ మీటర్ల మందం ఉండనుంది. వెనుక ప్యానెల్‌పై నిలువుగా స్ట్రిప్స్ ఉండడంతో లుక్ స్టైలిష్‌గా కనిపిస్తోంది. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రావొచ్చు. 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందించబడుతుంది.
ఇక రియల్‌మీ సీ30 డిస్‌ప్లే, కెమెరాలకు సంబంధించిన వివరాలు చూస్తే.. 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ LCD డిస్‌ప్లేతో ఈ ఫోన్ రానుంది. వెనుక 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రియల్‌మీ ఈ మొబైల్‌ను తీసుకొస్తుందని సమాచారం. 4జీ, వైఫై, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, చార్జింగ్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉంటాయి.
ఎంట్రీ లెవెల్ ధరలోనే రియల్‌మీ సీ30 ఉండనుంది. సుమారు రూ.7,000 దరిదాపుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఉండొచ్చు. తక్కువ ధరలో లైట్ వెయిట్, స్టెలిష్ లుక్ రానుండడంతో రియల్‌మీ సీ30 బడ్జెట్ రేంజ్‌లో మంచి ఆప్షన్‌గా ఉండొచ్చు.