Muslim Marriages: ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చు.. హర్యానా కోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముస్లిం యువతుల వివాహాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం దంపతుల రక్షణ పిటిషన్‌ను జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం విచారిస్తూ ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ బేడి షరియా చట్టాన్ని ప్రస్తావించారు. షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారు. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ ఇద్దరు ప్రేమికులు జూన్ 8, 2022న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
వారి కుటుంబాలు ఆ పెళ్లిని వ్యతిరేకించడంతో పాటు నూతన దంపతులను వారి కుటుంబసభ్యులు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నవ వధూవరులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బేడీ తన తీర్పులో ముస్లిం వ్యక్తిగత చట్టంపై దిన్షా ఫర్దూన్ జీ ముల్లా యొక్క పుస్తకాన్ని ఉదహరించారు. ఆ పుస్తకంలోని సెక్షన్ 195 ప్రకారం 16 ఏళ్లు పైబడిన అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. నూతన దంపతులకు సరైన భద్రత కల్పించాలని పఠాన్‌కోట్ పోలీసులను జస్టిస్ బేడీ ఆదేశించారు. ఎందుకంటే వారు ఇష్టానుసారం వివాహం చేసుకున్నందున వారి ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు జస్టిస్ తన తీర్పులో పేర్కొన్నారు.
Also Read
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
Asaduddin Owaisi: మోడీ జీ.. మీ ఫ్రెండ్ అబ్బాస్ అడ్రస్ ఇవ్వండి
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!