Srilanka: శ్రీలంకలో నేటి నుంచి రెండు వారాల పాటు షట్‌డౌన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చమురు నిల్వలు వేగంగా పడిపోతుండడంతో వాటిని ఆదా చేసేందుకు అత్యవసరం కానీ సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆస్పత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి.
మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా అక్కడ అధ్యక్ష సచివాలయ కీలక ద్వారాలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రధాన ద్వారాన్ని ఆందోళన కారులు దిగ్బంధించారు. తాజాగా రెండు ఎంట్రీపాయింట్లను కూడా వారు దిగ్బంధించారు. ‘గొట గో గమ’ నినాదాలతో చేపట్టిన ఆందోళన 73వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. అధ్యక్షుడి కంటే పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు ఉండేలా ప్రతిపాదిత 21 రాజ్యాంగ సవరణకు శ్రీలంక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్నదని మంత్రులు తెలిపారు. దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘే సోమవారం ఐఎంఎఫ్ బృందంతో చర్చలు జరిపారు.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి అత్యంతదారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 50 బిలియన్ డాలర్ల రుణ చెల్లింపుల తేదీలను పొడిగించాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా భారత్ సాయం చేస్తోంది. ఈ క్రమంలో జులై నుంచి నాలుగు నెలల పాటు ఇంధన కొనుగోళ్లకు కూడా క్రెడిట్ లైన్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైందని లంక ప్రధాని విక్రమసింఘే ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే భారత్ నుంచి 3,500 టన్నుల ఎల్‌పీజీ అక్కడకు చేరుకొంది.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!