India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారంతో పోలిస్తే ఇవాళ 22.4శాతం కేసులు తగ్గినట్లు వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396కు చేరింది. మరో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293మంది రోగులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. ప్రస్తుతం దేశంలో 79,313 కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.55శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.
దేశంలో సోమవారం 13,00,024 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,32,43,003 కోట్లకు చేరింది. మరో 3,88,641 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 2,786 కేసులు, మహారాష్ట్రలో 2,354 కేసులు, ఢిల్లీలో 1,060 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 686 కేసులు, హర్యానాలో 684 కేసులు నమోదైన మొదటి ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచే 76.28 శాతం కొత్త కేసులు రికార్డయ్యాయి.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!