Saria Waterfalls: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పచ్చని ప్రకృతి ఒడిలో పాలనురగులతో పరవళ్లు తొక్కే సరియా జలపాతం పర్యాటకుల పాలిట మృత్యుకుహరంగా మారింది. మండలంలోని శివారు ప్రాంతంలో ఉన్న జీనబాడు పంచాయతీలో ఉన్న ఈ జలపాతానికి విశాఖపట్నం, అనకాపల్లితోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు తరలివస్తుంటారు. బయటకు సాధారణంగా కనిపించే జలపాతం సమీపంలోని మూడు ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరంకు జిల్లాకు చెందిన 8 మంది శనివారం సరియా జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు. ఒకరు జలపాతంలో గల్లంతవ్వడంతో అతడిని రక్షించేందుకు ఇద్దరు నేవీ ఉద్యోగులు ప్రయత్నించారు. ఆ నేవీ అధికారుల్లో ఒకరు గల్లంతయ్యారు. సరియ జలపాతంలో వెంకటసాయి(28), నేవీ ఉద్యోగి దిలీప్‌కుమార్(30)లు గల్లంతైనట్లు గుర్తించారు.
Read Also: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!
ఈరోజు మధ్యాహ్నం సరియా జలపాతం సందర్శనకు వచ్చిన వెంకట సాయి కాలుజారి జలపాతంలో పడిపోగా.. అతని రక్షించేందుకు దిగిన దిలీప్‌కుమార్ కూడా గల్లంతయ్యారు. వెంకటసాయి విజయనగరం జిల్లాలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. వారిద్దరి ఆచూకీ కోసం అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించినప్పటికీ గల్లంతయిన వారి ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో అన్వేషణను నిలిపివేశారు.