Nandyal: నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద. తండ్రి, కుమారుడితో కలిసి ఉరుకుంద అనే వ్యక్తి మిద్దె పైకి ఎక్కాడు. ఇంటిని కూల్చివేస్తే దూకి చస్తానని బెదిరించాడు. ఉరుకుందకు పోలీసులు, అధికారులు సర్దిచెప్పారు. సర్ది చెప్పిన వినకపోవడంతో మధ్యాహ్నం అధికారుల బృందం వెళ్ళిపోయింది. ఇక ఇంటి యజమాని ఉరుకుంద మాత్రం మిద్దెపై నుంచి కిందకు దిగలేదు.
Read Also: Crime: వేధింపుల కేసు పెట్టేందుకు వెళ్లిన మహిళపై వ్యభిచారం కేసు!