YS Jagan: విజన్-2047 పేరిట చంద్రబాబు మరో పబ్లిసిటీ స్టంట్.. జగన్ ట్వీట్
- సీఎం చంద్రబాబు పాలనను విమర్శిస్తూ వైఎస్ జగన్ ట్వీట్
- విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని విమర్శలు
- ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ.-వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
1998లో కూడా చంద్రబాబు గారు విజన్-2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారన్నారు వైఎస్ జగన్. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయమన్నారు. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారన్నారు. చివరకు ప్రజలు కూడా విజన్-2020 కాదు, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యబట్టారన్నారు. 2014లోకూడా చంద్రబాబుగారు విజన్-2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని విమర్శలు గుప్పించారు.
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
Read Also: Group 2 Exam: గ్రూప్ 2 పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డ అభ్యర్థి
“తన పరిపాలనలో మొత్తం ౩ విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుకాని, ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? స్కూళ్లు బాగుచేశాడా? ఆస్పత్రులు బాగు చేశాడా? వ్యవసాయరంగాన్ని బాగుచేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవవనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తుమీద ఒక్కపైసా అయినా ఖర్చుచేశాడా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్-2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్ కాదా? ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడ్ని చీటర్ అంటారు కాని, విజనరీ అంటారా?” అంటూ వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు పాలనలో, ఆయన గత 14 ఏళ్లకాలంలో కూడా ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్నమాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. మరి ఇంకెక్కడి సంపద సృష్టి అంటూ జగన్ ఎద్దేవా చేశారు.. ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు, సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదన్నారు. ఇప్పుడు విజన్-2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కూడా కట్టుకథ కాదా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. “సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటినుంచి వచ్చే 10ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధిచెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబుగారు, ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపద ఆవిరిచేసే ఈ బాబుగారు, ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే “420’’ అని అంటారు.” అని జగన్ అన్నారు.
Read Also: PV Sindhu: తన వివాహానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు
ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి, అందరికీ సమాన అవకాశాలు కల్పించి, సుస్థిర అభివృద్ధి దిశగా వైయస్సార్‌సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. విద్యారంగంలో సీబీఎస్‌ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్, ఫాంగేట్ వద్దే ఎంఎస్‌పీకి పంటల కొనుగోళ్లు, ఆరోగ్యరంగంలో నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌లు, ఉపాధికల్పనా రంగంలో మైక్రో సాప్ట్ తో నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్ తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబుగారు నీరుగారుస్తున్నారు, రద్దుచేస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారన్నారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో కింద ఉన్నవారికి చేయూత నిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలుచేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి, పేదలను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్‌లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!