దాదాపు 15 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎప్పుడూ నిఖిల్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నది లేదు. 2007లో ‘హ్యాపీడేస్’లో రాజేష్ అనే ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాడిగా నటించి, తొలి విజయాన్ని అందుకున్న దగ్గర నుండి మెట్టు మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కరోనా కారణంగా సినిమాల షూటింగ్, అలానే విడుదలలో జాప్యం జరగడంతో ఇప్పుడు ఒకేసారి అతను నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పై వివిధ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు చిత్రాల షూటింగ్స్ తో క్షణం తీరికలేకుండా ఉన్నాడు. వాటిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ పాన్ ఇండియా మూవీ త్రీడీలో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకోగా, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ తెలిపారు. ప్రభాస్ ‘బాహుబలి’కి మూడు రెట్ల ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ […]
అయిననూ పోయిరావలె హస్తినకు…! ఇదే కాన్సెప్ట్‌తో చంద్రబాబు అండ్ కో ఢిల్లీ వెళ్లిందా? దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆయన ఏదైనా సాధిస్తారా? ఈ సమయంలో టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? టీడీపీ ఆఫీసులపై దాడులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు..! టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారనే అంశంపై ఒక రోజు రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చి.. మరో రెండు రోజులు దీక్ష చేపట్టిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని […]
ఒకవైపు ఉపఎన్నిక.. ఇంకోవైపు పార్టీ ప్లీనరీ. టీఆర్‌ఎస్‌కు ఈ రెండూ ముఖ్యమే. కానీ.. పార్టీ ప్లీనరీకి హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ నేతల రాలేదు. వదలరు.. కదలరు అన్నట్టు అక్కడే అతుక్కుపోయారు. ఇదే అధికారపార్టీలో చర్చగా మారింది. ఎందుకిలా? ప్లీనరీలో హుజురాబాద్‌పై గులాబీ బాస్ చేసిన ప్రకటనను పార్టీ వర్గాలు ఎలా చూస్తున్నాయి? హుజురాబాద్ నుంచి కాలు బయట పెట్టొద్దని ఆదేశాలు? హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల దృష్టి అంతా […]
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుండి కేసీఆర్ బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామమని పేర్కొన్నారు విజయశాంతి. ఢిల్లీ లో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందుకు మొదట హరీష్ రావు […]
సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరంలో వరి వేసినా ఖబడ్దార్, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ వెంకట్రామి రెడ్డి. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని తేల్చి చెప్పారు. సోమవారం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు పై కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… తమ నిర్ణయంపై జీఓలు ఏమి ఉండవని… ఇది తన హుకుమని చెప్పారు. తాను కలెక్టర్ […]
ఫేస్‌బుక్ ఓ అద్భుతం చేసింది. 58 ఏళ్ల క్రితం దూరమైన.. తండ్రి… కూతూరిని కలిపింది. ఇదోదే సినిమా కథలా ఉంది కదా..! కాని రియల్ సీన్. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఎక్కడ జరిగింది? ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా సొషల్ మీడియా వినియోగం పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది నెట్టింటే విహరిస్తుంటారు. నిత్యం ఫేస్‌బుక్,ఇన్‌స్ట్రాగ్రామ్‌లలలో మునిగి తేలుతుంటారు నెటిజన్లు. వీటి వల్ల ఎంతైతే నష్టాలు ఉన్నాయో.. అంతే లాభాలు ఉన్నాయ్. […]
హుజూరాబాద్ బైపోల్‌కు సమయం దగ్గరపడింది. ప్రచారం కూడా మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో మూడు పార్టీలూ ఓట్ల కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయితే ఓటర్ల నాడి ఏంటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఎవరికి వారు జనం మధ్యకు వెళ్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశాలు, రోడ్‌షోలతో హడావిడి చేస్తున్నారు. ఈనెల […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిపై చర్యలు తీసుకునేందుకు సమయాత్తం అవుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ వేసుకోని… వారికి ఫించన్ మరియు రేషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నవంబర్ 1 వ తేదీ లోగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని..లేని యెడల… వ్యాక్సిన్ తీసుకోని కుటుంబాలపై వేటు వేసేందుకు అడుగులు వేస్తోంది టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచనల […]
సినిమా భాషలో చెప్పుకోవాలంటే… బిగ్ బాస్ సీజన్ 5 అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది! 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదీ లేకుండానే యాభై రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన వారి నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేతవర్మ, ప్రియా వెళ్ళిపోగా ఇంకా 12 మంది మాత్రం మిగిలారు. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ టఫ్ […]