ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడంటే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు చిత్రాల షూటింగ్స్ తో క్షణం తీరికలేకుండా ఉన్నాడు. వాటిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ పాన్ ఇండియా మూవీ త్రీడీలో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకోగా, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ తెలిపారు. ప్రభాస్ ‘బాహుబలి’కి మూడు రెట్ల ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ ఇందులో ఉంటాయట.
విశేషం ఏమంటే… ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ పాత్రకు అక్టోబర్ 9న, సీత పాత్రదారిణి కృతీ సనన్ కు అక్టోబర్ 16న ఓమ్ రౌత్ వీడ్కోలు పలికాడు. రామాయణం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీరామ పాత్రధారి ప్రభాస్ వర్క్ చాలా బాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఓ పక్క గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుతూనే, అదే సమయంలో ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ ను నాన్ స్టాప్ గా జరిపి, వచ్చే నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఓం రౌత్ భావిస్తున్నాడట. అలా జరిగితేనే వచ్చే యేడాది ఆగస్ట్ 11కు సినిమాను విడుదల చేయగలరట. సో… ప్రస్తుతం ఓమ్ రౌత్ దృష్టి మొత్తం ప్రభాస్ ను రాముడిగా తీర్చిదిద్దడం మీదే ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!