ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,02,202 కి చేరింది. ఇందులో 3,35,83,318 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 1,63,816 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 356 మంది మృతి చెందారు. […]
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ప్రజల్ని తమవైపు ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. యూపీలో తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలందరికీ 10లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. […]
ఇప్పటి జనరేషన్ జనాలు చాలా బిజీ లైఫ్ కు అలవాటై పోయారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ.. పక్కవారిని పట్టించుకోవడం లేదు. అసలు ఇంట్లో వాళ్లనే పట్టించుకోనంత బిజీ అయిపోయారు. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ మెట్రోలో అమ్మకు అవమానం జరిగింది. ఓ బాలింత, పసికందుతో పాటు మెట్రో ఎక్కింది. మెట్రోలోని సీట్లు ఫుల్‌గా ఉండడంతో.. చేసేదేమి లేక నేలపై కూర్చుంది. ఆమె రావడం కూర్చోవడం అందరూ చూశారు. కానీ ఎవరూ ఆమెకు సీటివ్వలేదు. అమ్మకు సీటిచ్చేందుకు […]
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. నవంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఇది. అయితే ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. ఎందుకంటే ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆ […]
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్ డీలర్ల సంఘం. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని అలాగే… డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు డీలర్లు.2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు. […]
మన దేశం లోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 44, 850 కి […]
సీఎం కేసీఆర్… మహానాయకుడు అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ […]
ఢిల్లీః రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ను టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతి కి అందజేశారు చంద్రబాబు. ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని… రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు.. అలాగే… .అక్టోబర్ 19 న జరిగిన ఘటనల పై […]
తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక నియోజకవర్గం హుజూరాబాద్. గడిచిన ఐదు నెలలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనేది ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత క్లాస్టీ ఉప ఎన్నిక హుజూరాబాద్ నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా పారామిలిటరీ బలగాల విషయంలో హుజూరాబాద్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మోహరించిన […]