దేశంలో సంచలనం సృష్టించిన పెగాసిస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్పైవేర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి…ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
తాము సంప్రదించిన నిపుణుల్లో కొందరు…వ్యక్తిగత కారణాలతో కమిటిలో భాగస్వాములు కాలేకపోయారని…ఈ కారణంగానే తీర్పు ఆలస్యమవుతున్నట్లు సుప్రీం తెలిపింది. సమగ్ర అఫిడవిట్‌ను కేంద్రం అందించకపోవడంతో…అది లేకుండానే ఆదేశాలు జారీ చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. పెగాసిస్ స్నూపింగ్‌పై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని పలువురు జర్నలిస్టులో…పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన కోర్టు…గత నెల 13న తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు…నేడు వెల్లడించనుంది.