తెలుగుపాటకు వెలుగురేఖలు పొదిగిన వారిలో దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి కలం భలేగా పరుగులు తీసింది. చిత్రసీమలో అడుగు పెట్టక ముందే తెలుగుదేశమంతటా కృష్ణశాస్త్రి భావకవిత్వం చిందులు వేసింది. సినిమా రంగంలో ‘మనసున మల్లెల మాలలు ఊగించిన కవి’గా నిలచిపోయారు కృష్ణశాస్త్రి. ఆకాశవీధిలో సాగే మేఘమాలలతో ప్రేయసీప్రియుల నడుమ రాయబారాలు నడిపి, ‘చిత్ర మేఘసందేశం’ పలికించిన ఘనుడాయన! ‘పాడనా తెలుగు పాట…’ అంటూ పరవశింప చేసినదీ ఆయనే! ఏ తీరున చూసినా తెలుగు పాటల తోటలో కృష్ణశాస్త్రి వేసిన […]
‘అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…’ అని శ్రీదేవిని చూసి అన్నారు కానీ, నిజానికి ఆ పదాలు ఐశ్వర్యారాయ్ కి భలేగా సరితూగుతాయి – ఇదీ అప్పట్లో ఎంతోమంది రసపిపాసుల మాట! విశ్వసుందరి కాలేకపోయింది, ప్రపంచసుందరిగానే ఐశ్వర్యారాయ్ అందం బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై […]
రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తెలుగునాట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక వారు దర్శకులుగా మారి ఓ తొమ్మిది చిత్రాలు రూపొందించారు. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ మెగా ఫోన్ పట్టిన ఈ బ్రదర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ‘శ్రీకట్న లీలలు’కు కూడా దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఆరేళ్ళకు అదే సంస్థలో శోభన్ బాబు ప్రధాన పాత్రలో ‘సర్పయాగం’ రూపొందించారు. ఇందులో శోభన్ కు రోజా కూతురుగా నటించడం విశేషం. […]
టీ కొట్లు.. రచ్చబండల మీద జరిగే చర్చలు యమ రంజుగా ఉంటాయి. రాజకీయాలపై చాలా ఆసక్తిగా చర్చలు అక్కడ జరుగుతుంటాయి. ఒక మాజీ మంత్రిపై ఆ నియోజకవర్గంలో అలాంటి చర్చే నడుస్తోందట. చర్చకు కారణం ఆయనపై వచ్చిన ఒక కరపత్రం. ఆ కరపత్రాల టాక్స్ టీకొట్ల వరకు ఆగితే ఓకే.. పార్టీ అధినేత వరకు వెళ్తే ఏంటన్నదే ప్రశ్నగా మారింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..! కాల్వ చుట్టూ టీడీపీలో విమర్శలు..! గతంలో అనంతపురం జిల్లా టీడీపీలో […]
బెజవాడ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. పార్టీకి దూరమైపోతారని భావించిన కేశినేని నాని రీయాక్టీవ్ అయ్యారు. అప్పటి వరకు యాక్టీవ్‌గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమాలు డీలా పడ్డారు. ఇంతకీ ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? చంద్రబాబు దీక్షతో మారిన బెజవాడ టీడీపీ సీన్..! మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బెజవాడ టీడీపీ టీమ్ బాగా డిస్ట్రబ్ అయింది. నగరంలో ‘టీమ్ టీడీపీకి’ కీలకంగా ఉన్న ఎంపీ […]
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిశాక.. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ క్లియర్ అవుతుందా? టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆయన.. ఇంకా ఎదురు చూడాలా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.. తేలని కౌశిక్‌రెడ్డి పదవి..! పాడి కౌశిక్‌రెడ్డి. 2018లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి. ప్రస్తుత ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పుకొన్న రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీని చేస్తున్నట్టు అధికారపార్టీ తీపి కబురు అందించింది. గవర్నర్ […]
టీ-20 వరల్డ్‌కప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సాయంత్రం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లోచావోరేవో తేల్చుకోనుంది. అయితే గత కివీస్ రికార్డులు భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై కివీస్‌దే పైచేయి. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. 2019 వన్డే వరల్డ్‌కప్ […]
మీరు మటన్ ప్రియులా. అయితే తస్మాత్ జాగ్రత్త. తాజాగా గొర్రెలకు అంత్రాక్స్ వ్యాధి సోకుతుండటంతో… నాన్ వెజ్ ప్రియులు అలర్ట్‌గా ఉండాల్సిందే. ఇన్ని రోజులు మాంసం ప్రియులను బర్డ్ ఫ్లూ వణికించగా.. ఇప్పుడు ఆంత్రాక్స్ కలవరపెడుతోంది. అంత్రాక్స్ సోకిన గొర్రె మాంసంతో వండిన మటన్ తిన్నారో.. మీకూ రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తెలంగాణ వ్యాప్తంగా ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృత్యువాతపడ్డాయి. […]
హైదరాబాద్‌లో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. ప్రాపర్టీ ట్యాక్సులు కట్టకపోతే బిల్డింగులు సీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. గత ఏడాదిలో వసూలైన పన్నుల కంటే అధికంగా రాబట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో..ఆస్తి పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్న బకాయిదారులపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ట్యాక్స్ చెల్లించకుంటే భవనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ రెడ్ వారెంట్ జారీ చేయనుంది. ఆస్తి పన్ను ఎగ్గొడుతూ, పన్ను కట్టకున్నా ఏం కాదులే అనుకునే వారికి ఈ నిర్ణయంతో..GHMC […]
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలని మూడు ఎమ్మెల్సీ మరియు తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి. ఇక ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 9వ తేదీన వెలువబనుండగా…. నవంబర్ 16 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 17వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నవంబరు 22వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ ఉండనుంది. ఇక […]