అమరావతి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఊహించని షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖను నుంచి నారాయణ స్వామిని తప్పించింది ఏపీ ప్రభుత్వం. ఆ వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో భావించింది ఏపీ ప్రభుత్వం. అయితే అప్పట్లో అభ్యంతరాలు […]
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,830 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 446 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 14,667 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,73,300 కు […]
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికి…వైరస్ సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. ఇక నిశ్చితంగా ఉండొచ్చన్న భావన వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్‌లో 84 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నప్పటికీ…రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో 14శాతం మంది బూస్టర్ టీకాలు కూడా వేయించుకున్నారు. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండటంతో…ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. చనిపోయినవాళ్లలో 44 […]
మొన్నటి వరకు కరోనా…ఇప్పుడేమో వైరల్ ఫీవర్లు…ఢిల్లీని టెన్షన్ పెడుతున్నాయ్. వారం రోజుల్లోనే 3వందల మంది డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఢిల్లీ సర్కార్…కరోనా వార్డులను డెంగీ రోగులకు కేటాయించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే…మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో…ఆస్పత్రులన్నీ వైరల్ ఫీవర్ బాధితులతో నిండిపోతున్నారు. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు పడకలు… డెంగీ రోగుల కోసం కేటాయించాలని […]
సూపర్ సండేకు టీమిండియా రెడీ అయ్యింది. సాయంత్రం న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీసేన… ఈసారి సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్..ఇవాళ తలపడనున్నాయి. ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరాలంటే.. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే..ఇది డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. దాదాపు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. తొలి మ్యాచ్‌లోని తప్పులను […]
ఏపీలో దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు విధించారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చి… పండుగ జరుపుకోవాలని కోరింది. శబ్ధ కాలుష్యం లేకుండా చూడటం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. థర్డ్‌వేవ్ […]
తెలంగాణలో కొత్త మద్యం పాలసీని కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఎక్సైజ్ శాఖ. దీపావళి తర్వాత దుకాణాలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా రెండేళ్లకోసారి పాలసీ గడవు ముగుస్తుంది. నిజానికి…ఈ అక్టోబర్‌తో గడువు ముగియాల్సి ఉండగా..డిసెంబర్ వరకు పొడిగించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడినందున పాత లైసెన్స్‌లను పొడిగించాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు నుంచి కొత్త పాలసీ కూడా అమల్లోకి రానుంది. ఇక…కొత్త పాలసీ విధివిధానాలను ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి నేరుగా మద్దతు ప్రకటించనున్నారు పవన్. ఇవాళ మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద దీక్ష చేస్తున్న కార్మికులు, నిర్వాసితుల శిబిరాలను జనసేనాని సందర్శిస్తారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని పార్టీ విధానం వెల్లడిస్తారు. ఇక…ఇప్పటికే జనసేన తన సంపూర్ణ మద్దతును ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి ప్రకటించింది. ఐతే…నేరుగా పవన్ కళ్యాణ్ రావడం […]
నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాల వారి నుండి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేసింది. రైజ్ […]