టీ-20 వరల్డ్‌కప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సాయంత్రం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లోచావోరేవో తేల్చుకోనుంది. అయితే గత కివీస్ రికార్డులు భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై కివీస్‌దే పైచేయి. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే.
2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్.. 2021 టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. గత రెండు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. గత టీ-20 ప్రపంచకప్‌లో కూడా టీమిండియాను సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఓవరాల్‌గా చూస్తే ప్రస్తుతం భారత్‌దేపైచేయిగా కనిపిస్తున్నా.. కివీస్ ఎంత ప్రమాదకర ప్రత్యర్థో కోహ్లి సేనకు బాగా తెలుసు. మొదటి మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెట్టిన ఇరు జట్లు.. తొలి విజయం కోసం రెండు జట్లు సన్నద్ధమైన తరుణంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.