రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు.రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం […]
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎంపీ లనే చంద్రబాబు బిజెపిలోకి పంపించాడని.. వైసీపీ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడని నిప్పులు చెరిగారు. “సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బిజెపిలోకి పం పించాడు. దానిపై ఒక్క మాట […]
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అయితే మనదేశంలో కరోనా వ్యాక్సిన్ లేదా కరోనా వైద్యం కోసం ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే.. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సేతు యాప్ లేదా కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లేకపోతే ఇక అంతే సంగతులు. అటు ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే.. కరోనా […]
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు సంస్థ భారీ సాయాన్ని ప్రకటించాయి. అటు క్రికెటర్లు, సినిమా స్టార్లు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేమస్ డైరెక్టర్ శంకర్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా కట్టడి కోసం.. తమిళనాడు ప్రభుత్వానికి రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు శంకర్. ఇక ఇప్పటికే సూర్య, […]
మాజీ మంత్రి ఈటలకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించగా.. తాజాగా మంత్రి గంగులను శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు కలిసి ఈటలకు షాక్ ఇచ్చారు. మంత్రి గంగులను కలవడమే కాకుండా.. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి గంగులకు వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా మంత్రి గంగుల హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని […]
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో కాంగ్రెస్ ఎంపి రాజీవ్ సాతావ్ ఇవాళ మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,11,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 కి చేరింది. ఇందులో 2,07,95,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,18,458కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,077 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో […]
ఇండియాలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 24 […]
వైసీపీ ఎంపీ రఘురామరాజు కాలి గాయాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జీజీహెచ్ సూపరెండేంట్, జనరల్ మెడికల్ డిపార్ట్మెంట్ శాఖ HOD, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరెండేంట్ సూచించిన గవర్నమెంట్ డాక్టర్.. ఈ ముగ్గురితో కూడిన మెడికల్ కమిటీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేయాలని… రికార్డు చేసిన వీడియోను పెన్ డ్రైవ్ లో సీల్డ్ కవర్లో హైకోర్టుకు వ్యాక్సినేషన్ ఆఫీసర్ M.నాగేశ్వరరావుకు […]
ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ఈ లేఖలో కోరారు సీఎం జగన్. అంతేకాదు ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని.. […]