చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో కాంగ్రెస్ ఎంపి రాజీవ్ సాతావ్ ఇవాళ మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడైన సాతావ్ ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత ఆయన పూణేలోని జహంగీర్ ఆస్పత్రిలో చేరి, వెంటీలేటర్ పై వైద్యం పొందుతూ మృతి చెందారు. 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నుంచి రాజీవ్ సాతావ్ ఎంపిగా ఎన్నికయ్యారు. ఇది ఇలా ఉండగా..రాజీవ్ సాతావ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.