చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అయితే మనదేశంలో కరోనా వ్యాక్సిన్ లేదా కరోనా వైద్యం కోసం ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే.. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సేతు యాప్ లేదా కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లేకపోతే ఇక అంతే సంగతులు. అటు ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే.. కరోనా వైద్యం అందించడం లేదు ఆస్పత్రులు. అయితే ఈ ప్రక్రియతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో వైద్యం, మందులు, వాక్సిన్ విషయంలో ఆధార తప్పనిసరి కాదని ఆ సంస్థ తేల్చేసింది. ఆధార లేదని చెప్పి వ్యాక్సిన్ లను ఇవ్వడం నిరాకరించరాదని, అలాగే ఆధార్ లేకపోతే కరోనా సేవలను అందించలేమని చెప్పకూడదని యూఐడీఏఐ పేర్కొంది. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన రీలీజ్ చేసింది.